
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కార్తీక పౌర్ణమి ఉత్సవాలలో బిజీ బిజీగా గడుపుతుంటే మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో అన్ని దేవాలయాలు కూడా కిటకిటలాడుతున్నాయి. నదులలో పుణ్యస్నానాలు చేసి.. దీపాలను వెలిగించి, స్వామివారిని దర్శనం చేసుకుని ఉపవాసం ఉండడానికి మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో వర్షాలు కూడా కురుస్తూ ఉంటాయని.. రేపు ఉదయం వరకు కూడా కొన్ని జిల్లాలకు వర్ష ప్రభావం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
నేడు వర్షాలు కురిసే జిల్లాలు :-
1. ఖమ్మం
2. నల్గొండ
3. సూర్యాపేట
4. మహబూబాబాద్
5. వరంగల్
6. హనుమకొండ
7. వికారాబాద్
8. రంగారెడ్డి
9. సంగారెడ్డి
10. మహబూబ్ నగర్
11. నాగర్ కర్నూల్
పైన పేర్కొన్న ఈ 11 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు
1. హైదరాబాద్
2. నారాయణపేట
3. గద్వాల్
4. జనగామ
5. సిద్దిపేట
6. భువనగిరి
7. మేడ్చల్
8. మెదక్
పైన పేర్కొన్న ఎనిమిది జిల్లాల్లో విపరీతమైన ఈదురుగాలులతో.. ఉరుములు మరియు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ఈ వర్షం సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని అధికారులు సూచించారు.
Read also : USA లో కుప్ప కూలిన కార్గో విమానం.. ఘోరంగా ఎగిసిపడ్డ మంటలు!
Read also : గల్లి గల్లీలో చెత్త ఉంది.. ఆ చెత్త నా కొడుకు వల్లే కదా : సీఎం రేవంత్





