
క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్ :- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచినటువంటి ఓజీ సినిమా నిన్న అర్ధరాత్రి నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఫ్లాట్ ఫామ్ అయినటువంటి నెట్ ఫిక్స్ లో ఓ జి సినిమా ను ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు 310 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. పవన్ కళ్యాణ్, ప్రియాంక చోప్రా జంటగా కలిసినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిందని చెప్పాలి. ఈ సినిమాకు BGM హైలైట్ గా నిలిచిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. తమన్ మ్యూజిక్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులనే కాకుండా దేశవ్యాప్తంగా పేక్షకులందరినీ కూడా అలరించాడు. మరోవైపు సినిమాలో నటించినటువంటి ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్ వంటి నటులు కీలకపాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా రోజుల తర్వాత ఒక మంచి గూస్ బంప్స్ తెప్పించే సినిమాగా ఇది నిలిచింది. పవన్ కళ్యాణ్ తరువాత రాబోయే ఎటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఏ తన చివరి సినిమా అని… ఆ తరువాత సినిమాల్లో నటించను అని పవన్ కళ్యాణ్ ఇంతకుముందే చెప్పారు. పూర్తిగా రాజకీయాల్లోనే ప్రజలకు సేవలు చేస్తూ జీవితాన్ని అంకితం చేస్తానంటూ చెప్పారు. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై ఫ్యాన్స్ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ను సినిమా పరంగా చూడలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also : అందరి చూపు మేడారం వైపే… జాతరకు సంసిద్ధం కాండి..!
Read also : భారీ వర్షాలు.. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : మంత్రి అనిత