
చండూరు, క్రైమ్ మిర్రర్:- చండూరు శివారు ఉడతలపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 188,216 217 లలో శ్రీ సాయి వెంకటేశ్వర వండర్ సిటీ పేరుతో వెంచర్ వెలిసింది. అయితే ఈ సర్వే నెంబర్లు ఆనుకొని ఉన్న 206 సర్వేలోని ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసి రోడ్లు వేసి ప్లాట్లుగా మలిచారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. వెంచర్లో ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా సర్వే నివేదిక ద్వారా బట్టబయల్ అయింది. వెంటనే భూమిని స్వాధీన పరుచుకోవాలని ఆర్డిఓ తహసిల్దార్ కు సుమారు ఏడాది క్రితం లేఖ పూర్వకంగా ఆదేశాలు ఇచ్చారు. కానీ అమలులో మాత్రం నిర్లక్ష్యం చోటు చేసుకుంది. క్రైమ్ మిర్రర్లో నిన్న వార్త వచ్చింది. శుక్రవారం డిటి చంద్రశేఖర్,సర్వేయర్ నాగేశ్వర్ కలిసి భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 36 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా తెలిపారు. 2,3 రోజుల్లో తమ సిబ్బంది ద్వారా హద్దురాళ్ళు పాతి భూమిని స్వాధీన పరుచుకొని బోర్డు ఏర్పాటు చేయిస్తామని డిటి చంద్రశేఖర్ తెలిపారు. కాగా ఇప్పటికే ప్రభుత్వ భూమిలో వెంచర్ వాళ్ళు రోడ్డు వేసి పలు ప్లాట్లు కూడా చేశారు. వాటిని కొంతమందికి విక్రయించినట్టుగా కూడా తెలుస్తోంది. నక్షబాట విషయం కూడా ఇంకా తేలాల్సి ఉంది.
Read also : Jubilee hills Election: బీఆర్ఎస్ ఓటమిపై కవిత సంచలన ట్వీట్
Read alos : Jubilee hills Election: బీఆర్ఎస్ భారీ ఓటమి.. అసలు కారణాలు ఏమిటి?





