క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ లోని 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. కాగా నేడు ఉదయం 10:30 గంటలకు నూతనంగా గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తమ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు.
అయితే ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు కొత్త కళను సంతరించుకున్నాయి. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే నూతన సర్పంచ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ తొలి సమావేశం జరగనుంది. తమకు ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలకవర్గం తీర్మానం చేయనుంది.
దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు.





