తెలంగాణ

Good News: నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు షురూ..!  

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో 2025-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నూతన ఎక్సైజ్ పాలసీ కొత్త మద్యం దుకాణాలు (వైన్ షాపులు) నేటి నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలు కొత్త లైసెన్సులతో పనిచేయడం మొదలుపెట్టాయి.
ఈ కొత్త లైసెన్సుల కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది (డిసెంబర్ 1, 2025 నుండి నవంబర్ 30, 2027 వరకు).దుకాణాల కేటాయింపు ప్రక్రియ లాటరీ పద్ధతిలో పూర్తయింది. ఈ ఏడాది సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో దరఖాస్తులు స్వీకరించారు.
దరఖాస్తు రుసుమును నాన్-రిఫండబుల్‌గా రూ. 3 లక్షలకు పెంచారు, దీని ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరింది. భవిష్యత్తులో ఏదైనా సమాచారం కోసం, దరఖాస్తుదారులు తెలంగాణ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ విభాగం అధికారిక వెబ్‌సైట్ను సందర్శించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button