
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది ప్రేమ కారణంగా.. మరికొంతమంది జీవితంలో ఏది సాధించలేకపోయాం అని కొందరు.. ఇంకొంతమంది పరీక్షల్లో ఫెయిల్ అవుతామేమో అనుకుని ఒత్తిడికి గురై చనిపోవడమే మార్గం అనుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక విద్యార్థి కూడా ఇదే బాటలో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విద్యార్థి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు కూడా వీటిపై ఆరా తీస్తున్నారు.
Read also : శీతాకాలం ఆరంభం… పర్యాటకులతో అరకు అదుర్స్!
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అనే 21 ఏళ్ల విద్యార్థి వైద్య కోర్సులు అడ్మిషన్లకు నిర్వహించేటువంటి NEET అనే ఎగ్జామ్ టెస్టులో ఫెయిల్ అవ్వడంతో.. మనస్థాపానికి గురై అతను ఉండేటువంటి రావత్పూర్ లోని హాస్టల్ గదిలోనే సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్న.. మరోవైపు డాక్టర్ అవ్వాలని మీ కలలను నెరవేర్చలేక పోతున్నాను అంటూ… అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా అంటూ.. దీనికి పూర్తి బాధ్యుడిని నేనే అని ఉన్నటువంటి సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని మీడియా వేదికగా తెలిపారు. అయితే ఈ ఆత్మహత్యపై విద్యార్థి ఇలా చేయడం పట్ల ఒకవైపు అతని తల్లిదండ్రులతో పాటు మరోవైపు సొసైటీ కూడా ఆందోళనకు గురవుతుంది. జీవితమంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు అంటూ చాలామంది తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Read also : గుండ్రంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. తన ప్రాణాలు అడ్డువేసి 8 మంది ప్రయాణికులను కాపాడిన లారీ డ్రైవర్లు!





