Homeతెలంగాణనందిపాడు గ్రామ.. శతాధిక వృద్ధుడు మృతి!

నందిపాడు గ్రామ.. శతాధిక వృద్ధుడు మృతి!

మద్దూర్, క్రైమ్ మిర్రర్:- నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని నందిపాడు గ్రామానికి చెందిన రాచూరి కిష్టప్ప (103) సంవత్సరాలు వయోభారం కారణంగా మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బలహీనపడడంతో శుక్రవారం ఉదయం చివరి శ్వాస విడిచారు.
కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం ఆయన వయసు పైబడినా సహజశక్తులు కొంతవరకు సక్రమంగానే ఉండేవి. ఒక ప్రత్యేక విశేషం ఏమిటంటే, ఆయన నోట్లో పాత పళ్ళు ఊడిపోయిన తరువాత మళ్లీ కొత్త పళ్ళు రావడం జరిగింది. గ్రామంలో ఈ సంఘటనపై పెద్ద చర్చనీయాంశమైంది. కిష్టప్పకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వృద్ధుడి మరణంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. వంద సంవత్సరాలకు పైగా బ్రతకడం ఈరోజుల్లో మామూలు విషయం కాదు.

Read also :సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సుంకరి భిక్షం గౌడ్

Read also: టీఆర్పీకి మైలేజ్‌ దక్కేనా? తెలంగాణలో మల్లన్న పార్టీ ప్రయోగమేనా?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments