సినిమా

వార్ -2 పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన నాగ వంశీ

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ టైగర్ హృతిక్ రోషన్ కలిసి నటించినటువంటి సినిమా వార్ -2. ఈ సినిమా బాలీవుడ్లో బాగానే ఆడినా కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం అంతగా రాణించలేకపోయింది. సినిమా కలెక్షన్లు కూడా అంతగా రాకపోవడంతో నిర్మాత నాగవంశీ పై చాలామంది తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం నాగ వంశీ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. అయితే తాజాగా నిర్మాత నాగ వంశీ మరోసారి వార్ 2 సినిమా పై స్పందించారు. బాలీవుడ్ బడా నిర్మాత ఆదిత్య చోప్రాను నమ్మే ఈ మూవీకి తెలుగు రైట్స్ తీసుకున్నట్లు స్పష్టం చేశారు.అయినా కూడా ఈ సినిమా మిస్ ఫైర్ అవడంతో అభిమానుల నుంచి గట్టిగానే విమర్శలు వచ్చి పడ్డాయని నిర్మాత నాగ వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా వచ్చినటువంటి కొత్తలోక సినిమాను నేనే తెలుగులో రిలీజ్ చేశానని.. ఒకవేళ ఈ సినిమా నేరుగా తెలుగులోనే వచ్చి ఉంటే ఖచ్చితంగా ల్యాగ్ ఉందని నన్ను తిట్టేవారని తన అభిప్రాయాన్ని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఏం చేసినా కొంతమంది ఒకరకంగా ఆలోచిస్తారు.. మరి కొంతమంది మరోరకం లా ఆలోచిస్తారని… కాబట్టి ఒక పని చేస్తే దానిపట్ల ప్రశంసలు, విమర్శలు రెండు ఉంటాయని నిర్మాత నాగ వంశీ స్పందించారు. జీవితంలో ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకచోట తప్పు చేస్తూనే ఉంటాడు… అలా అని అతడు తప్పుడు వ్యక్తి కాదు కదా… జస్ట్ ఆ టైం బాగాలేదు అంతే అని నిర్మాత నాగ వంశీ war -2 సినిమా సందర్భంలో జరిగిన విషయాల గురించి స్పష్టత ఇచ్చారు.

Read also : ఇండియా పై ఆరోపణలు సరికాదు : ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి

Read also : తండ్రీకొడుకులు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలే : కన్నబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button