
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- హీరో పృధ్విరాజ్ తన నటనతో ప్రతి ఒక్కరిని కూడా మైమరిపిస్తున్నారు. తన లుక్స్ అలాగే తన ఆటిట్యూడ్.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఒక మంచి మనిషిలాను గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ ప్రస్తుతం రాజమౌళి మరియు మహేష్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి వారణాసి మూవీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే సమయంలో అతనిపై సైబర్ అటాక్ అన్ని విధాలుగా నాశనం చేయడానికి పన్నాగాలు పన్నుతుంది అని పృధ్విరాజ్ తల్లి మల్లికా కీలక ఆరోపణలు చేశారు. హీరోగా నా కొడుకు ఎదగడాన్ని కొందరు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అని ఆమె వెల్లడించారు. తన ఎదుగుదలను తట్టుకోలేక సోషల్ మీడియా వేదికగా కొందరు ఘోరంగా అవమానిస్తున్నారు అని వారిపై తీవ్రంగా మండిపడ్డారు. ఎవరైనా ఒక మనిషి తన సొంత టాలెంట్ తో పైకి ఎదిగితే వారిని చూసి చాలా మంది కూడా ఓర్వ లేకపోతున్నారు అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక నా కొడుకు విషయంలో సోషల్ మీడియా వేదికగా వచ్చేటువంటి అన్ని చెడు వ్యాఖ్యలు అలాగే ట్రోల్స్ ఇలాంటివి ఆపేంత వరకు ఒక తల్లిగా నేను పోరాటం చేస్తూనే ఉంటాను అని ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈమె స్పష్టం చేశారు. ఒక హీరో తల్లి తన కొడుకు గురించి తప్పుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అని తెలియగానే ఇలా ఇంటర్వ్యూలో ధైర్యంగా వాటిని అడ్డుకునేంతవరకు నేను పోరాడుతున్నాను అని చెప్పడం.. నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయమని ఆమెను సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు. ఇక మన టాలీవుడ్ లో ఇలాంటివి ఎన్ని వచ్చినా కూడా అవన్నీ పట్టించుకోవద్దు అని.. ఆ హీరోలు అలాగే హీరోయిన్లు మాత్రమే చెబుతూ ఉండడం చూస్తున్నాం. ఇలా హీరోల తల్లి లేదా తండ్రి మీడియా ముందుకు వచ్చి ఇలా చెప్పడం ఎక్కడా కూడా జరగలేదు. తన కొడుకు కెరీర్ నాశనం చేయాలని చూస్తున్న సందర్భంలో ఒక తల్లిగా ముందడుగు వేసి వాటిని ఎదుర్కోవడం అనేది నిజంగా ప్రశంసించాల్సిన విషయమే.
Read also : గ్రామాల్లో వేడి పుట్టిస్తున్న ‘క్యాంపు’ రాజకీయాలు..!
Read also : Medical Miracles: వ్యక్తి కడుపులో కండోమ్.. కట్ చేస్తే..





