
రామకృష్ణాపూర్, క్రైమ్ మిర్రర్ :- రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైందని మున్సిపల్ కమిషనర్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వార్డుల వారీగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డుతో పాటు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు..
ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పులు,వార్డుల మార్పు వంటి అభ్యంతరాలు ఉంటే ఈ నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు కార్యాలయంలో సమర్పించవచ్చని. అభ్యంతరాలను అధికారుల బృందం 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని అన్నారు. అన్ని సవరణలు పూర్తి చేసిన అనంతరం, జిల్లా కలెక్టర్ ఆమోదంతో 10వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని కమిషనర్ కోరారు. గతంలో 2020 ఎన్నికల సమయంలో ఓటు వేసిన వారు కూడా, ప్రస్తుతం ఏదైనా పొరపాట్ల వల్ల వార్డులు మారాయేమో గమనించాలని సూచించారు. ఏదైనా మార్పులు కోరుకునే వారు తగిన ఆధారాలతో (లోకల్ ప్రూఫ్) దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. 10వ తేదీ తర్వాత జాబితాలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
Read also : సూరారం గ్రామంలో పంబరట్టు వేడుకలు
Read also : సంక్రాంతికి బరిలో తోపు మూవీస్.. మరి టికెట్ రేట్ల సంగతేంటి?





