హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ః రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీ లలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 123 కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు.
మధ్యాహ్నం వరకు మున్సిపాలిటీల ఫలితాలు సాయంత్రం లోగ కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాక సాధారణ బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది.









