మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. ఈరోజు సాయంత్రం నుంచి వైన్స్, బార్లు బంద్

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలలో భాగంగా వైన్స్ మరియు బార్లు బంద్ కానున్నాయి. అన్ని మున్సిపాలిటీలలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు కూడా మద్యం దుకాణాలు మూసివేయాలి అని తాజాగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మళ్ళీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యేటువంటి 13వ తేదీన కూడా బంద్ పాటించాలి అని ఎన్నికల కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయంపై జాగ్రత్త వహించి ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను పాటించాలి అని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. కాగా 11వ తేదీ ఒకే విడతలో ఈ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది. ఒకవేళ వైన్స్ లేదా బార్లు ఈ ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో మందుబాబులకు ఈ రెండు మూడు రోజులు నిరాశే అని చెప్పవచ్చు.
Read also : చండూరు మున్సిపాలిటీలో రాజకీయ వేడి పెంచిన అన్నెపర్తి శేఖర్ మేనిఫెస్టో
Read also : వరల్డ్ కప్ లో పసి కూనల పోరాటం అద్భుతం









