-
జీవిత భీమాలో ఉత్తమ సర్వీస్..
-
100 పాలసీలు పూర్తి చేసిన ముక్కెర శ్రీశైలం..
-
అభినంధించిన ఎల్ఐసి అధికారులు.. శాలువాతో సన్మానం..
మాడ్గుల (క్రైమ్ మిర్రర్):- ఎల్ఐసి జీవిత భీమా సంస్థ ఎందరో జీవితాలలో వెలుగులు నింపింది. కుటుంబ పెద్దగా భారం మోసే ఎల్ఐసి భారత దేశంలో అగ్రగామిగా నిలిచిన విషయం అందరికి తెలిసినదే. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని, దేవరకొండ బ్రాంచ్ ఏజెంట్ ముక్కెర శ్రీశైలం, అద్భుత సేవలను అందించారు..
ఈ ఆర్థిక సంవత్సరంలో ముందుగా 100 పాలసీలను పూర్తి చేసి, తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. జీవిత భీమా గొప్పతనాన్ని ప్రజలకు తెలియపరుస్తూ, శ్రీశైలం ఈ ఘనతను సాదించారు. ఈ సందర్బంగా మాల్ షాటిలైట్ కార్యాలయంలో, ఎల్ఐసి అధికారులు శ్రీశైలంను అభినందిస్తూ సన్మానించారు..
ఈ కార్యక్రమంలో మాల్ బ్రాంచ్ మేనేజర్ శివ కృష్ణ, డివో ధనుంజనేయులు, శ్రీనివాస్ రావు, సత్తయ్య, ఏజెంట్ లు బోనగిరి పురుషోత్తం, తోట వెంకటేశ్వర్లు, గనేటి ఈశ్వరయ్య, ఈడేం యాదగిరి, తేలకుంట శ్రీశైలం, జాజాల శంకర్, యంజాల అనిల్, పగడాల జానకి తదితరులు పాల్గొన్నారు..





