జిల్లా సమీక్షమండలి సమావేశానికి హాజరైన ఎంపీ.. తన పేరు పిలవలేదని అలిగి వెళ్లిపోయారు. సభ జరుగుతుంగానే వేదిక దిగి ఎంపీ సీరియస్ గా వెళ్లిపోవడంతో అంతా షాకయ్యారు. ఎంపీని వారించడానికి అధికారులు పరుగులు పెట్టారు. అయినా తనను అవమానం జరిగిందన్న కోపంతో అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోయారు సదరు ఎంపీ. ఈ ఘటన నెల్లూరు జిల్లా సమీక్షమండలి సమావేశంలో జరిగింది.
స్టేజీపై తన పేరు చెప్పలేదని సమావేశంలో మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.నెల్లూరు నగరంలోని ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా మండలి సమావేశం స్టేజీపై అందరి పేర్లు చెప్పిన నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష..ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పలేదు. అంతేకాదు స్టేజీపైకి వచ్చిన ఎంపీకి అధికారులు బొకే కూడా ఇవ్వలేదు. మరోవైపు సమావేశానికి వచ్చిన మంత్రులు నారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డీలకు బొకేలు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు అధికారులు.
అధికారుల తీరుపై తనకు స్టేజీపై తనకు తగిన గౌరవం దక్కలేదని అలిగి వెళ్లిపోయారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కారు వరకు వెళ్ళి ఆయనను సముదాయించేందుకు ప్రయత్నించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.అయినా శాంతించకుండా వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి ..
- పవన్ను అడ్డుకోవడంతో రాజమండ్రిలో ఉద్రిక్తత
- విజయమ్మ హత్యకు జగన్ స్కెచ్? టీడీపీ సంచలన ట్వీట్
- గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నారా? అయితే ఇవి తప్పనిసరి..
- BHEL ఉద్యోగి నుంచి టీటీడీ చైర్మెన్.. బీఆర్ నాయుడు చరిత్ర ఇదే..!
- 1,000 కోట్లు లాస్.. తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఢమాల్
- అడ్డగోలుగా టికెట్ రేట్లు.. నిలువు దోపిడీ చేస్తున్న TGSRTC