శివసేన ఎంపీ అయినటువంటి సంజయ్ రౌత్ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈమధ్య సిరియా లో తిరుగుబాటుతో ఏకంగా ప్రధాని దిగిపోయిన విషయం మనందరికీ తెలిసిందె. ఇక ఇదే తరహాలో మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా దించేస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఇక సిరియా తరహా లోనే భారతదేశంలో కూడా తిరుగుబాటు వస్తుందని జోష్యం చెప్పినట్లు చెప్పారు.
వైసీపీకి బిగ్ షాక్!… మాజీ మంత్రి రాజీనామా?
ప్రస్తుతం బిజెపి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీని ప్రజలు కచ్చితంగా ప్రశ్నించాలని సంజయ్ రౌత్ అన్నారు. ప్రజాస్వామ్యం పేరిట భారతదేశంలో వారు చేసే అరాచకాలన్నీ ప్రజలు ఇంకెన్నాళ్లు భరిస్తారు అని తీవ్రంగా మండిపడ్డారు. ఏదో ఒక రోజు భారతదేశంలో బిజెపి పాలన అంతమవుతుందని జోష్యం చెప్పారు.
కేంద్రం తీపి కబురు!… ఉచిత బీమా కింద వృద్దులందరికీ ఐదు లక్షలు?
కాగా సిరియాలో ఈమధ్య అధ్యక్షుడిని ప్రజలు తరిమి కొట్టినట్లు భారతదేశంలోని ప్రధానమంత్రిని కూడా ఇదే విధంగా తరిమికొట్టాలని ప్రజలకు విన్నపించారు. కానీ ఈ మాటలు విన్న చాలా మంది కూడా నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు ఒక స్ఫూర్తిగా నిలిచాడని మీరన్న మాటలు అసలు సాగవని చాలామంది కామెంట్లు రూపంలో తెలియజేశారు. భారతదేశానికి చిక్కిన ఒక వరం నరేంద్ర మోడీ అని అందుకే మూడుసార్లు ప్రధానమంత్రి అయ్యారని, ఎవరు కూడా నరేంద్ర మోడీని ప్రధాని అధిష్టానం నుంచి దించలేరని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.