
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా భారీ పంట నష్టం వాటిల్లడమే కాకుండా ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడం వల్ల ఎన్నో పంటలు నాశనమవడంతో మిగిలిన పంటల యజమానులకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఆకుకూరల నుంచి పలు అన్ని రకాల కూరగాయల ధరలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ప్రస్తుతం అన్ని రకాల కూరగాయలు పావు కేజీ 30 రూపాయలకు పై మాటే. అంటే కేజీ దాదాపు 100 నుంచి 120 రూపాయలు పలుకుతుంది. ఇంత ధరలు ఎందుకని యజమానులను ప్రశ్నించగా… వారందరూ కూడా మంతా తుఫాను ప్రభావం కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోయాయి.. అందుకే ఇంత ధరలు పలుకుతున్నాయి అని వారు సమాధానం చెబుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలపై మొంథా తుఫాన్ అనేది ఎంతలా ప్రభావం చూపిందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు.
Read also : రేపటితో ముగియనున్న ఎన్నికలు.. స్థానిక ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్?
Read also : Weather Alert: మరో రెండు రోజులు భారీ వర్షాలు





