క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రోత్సాహం మరియు ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

నల్గొండ జిల్లా, నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ముఖ్య అతినిధిగా హాజరై, ప్రభుత్వ పథకాల ద్వారా మంజూరైన స్కూటీలు మరియు ల్యాప్‌టాప్‌లను అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు ఎమ్మెల్యే మంగళవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ… దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రోత్సాహం మరియు ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు..





