
-అకాల వర్షాలకు రైతులు తీవ్ర నష్టపోయారు… ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
-నియోజకవర్గంలో పత్తికి అత్యధిక నష్టం
-రైతులను ఆదుకోవాలని కలెక్టర్ ను కోరిన ఎంఎల్ఏ
మునుగోడు, క్రైమ్ మిర్రర్ :- అకాల వర్షాల ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పత్తి రైతులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే కలెక్టర్ ఇలా త్రిపాఠి తో చరవాణి ద్వారా మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా పత్తిని పండిస్తున్నారని, అకాల వర్షాల వల్ల 50 శాతానికి పైగా పత్తి దెబ్బ తినడం జరిగిందన్నారు. 12 నుండి 7 క్వింటాల వరకు మాత్రమే కొనుగోలు చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు..వీలైనంత త్వరగా సీసీఐ అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.లైసెన్సు లేకుండా దళారులు రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తున్నారంటూ మునుగోడు మండలములో దళారుల ఎంతమంది పత్తి కొనుగోలు చేస్తున్నారో జాబితాను సిద్ధం చేయాలని పోలీసులను ఆదేశించారు.
Read also : అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆటగాళ్ల?.. సురేష్ రైనా, ధావన్ పై సజ్జనార్ ఫైర్?
Read also : నాకు ప్రపంచ శాంతే ముఖ్యం.. లేదంటే ప్రపంచాన్ని పేల్చగలను : ట్రంప్





