
పెబ్బేరు, క్రైమ్ మిర్రర్:- పట్టణాభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి మునిసిపాలిటీకి తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో రూ.18 కోట్ల 70 లక్షలను మంజూరు చేసినట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. యూఐ నుంచి మంజూరైన ఈ నిధుల నుంచి వనపర్తి పట్టణంలోని 33 వార్డులలో సీసీ రోడ్లు,డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధుల మంజూరికి సహకరించిన ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ,జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు,వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.
Read also : భార్య కాపురానికి రావడం లేదని పెట్రోల్ పోసుకొని ఏఆర్ కానిస్టేబుల్ మృతి
Read also : సోషల్ మీడియాతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి : SI యుగేందర్ గౌడ్





