తెలంగాణ

సీఎం రేవంత్‌పై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • తన భార్య ఫోన్‌ ట్యాప్‌ చేశారని కౌశిక్‌ ఆరోపణలు

  • మిస్‌ వరల్డ్‌ పోటీదారుల ఫోన్లు ట్యాప్‌ చేశారన్న కౌశిక్‌

  • రేవంత్‌ బండారం బయటపెడతానని హెచ్చరికలు

  • కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బల్మూరి

  • వెంటనే క్షమాపణ చెప్పాలని బల్మూరి వెంకట్‌ డిమాండ్‌

  • లేదంటే తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరిక

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్‌: తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కొన్నాళ్లుగా ఫోన్‌ ట్యాపింగ్‌ విషయం హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది. కేసులు, విచారణలతో రోజుకో న్యూస్‌ బయటకు వస్తోంది. తాజాగా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనాలను రేకెత్తిస్తున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ లీగలేనన్న రేవంత్‌… తన భార్య ఫోన్‌ కూడా ట్యాప్‌ చేశారని కౌశిక్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. భార్యాభర్తల ఫోన్లను రేవంత్‌ ట్యాప్‌ చేసి వింటున్నారని కౌశిక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌశిక్‌ రెడ్డి మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగులు సహజమేనని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేయాలని కౌశిక్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు అధికారులు, హీరోయిన్ల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని కౌశిక్‌ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేతలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే రేవంత్‌ ఎవరెవరితో తిరిగారో ఆ 16మంది పేర్లు బయటపెడతానని కౌశిక్‌ రెడ్డి హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌లో, ఢిల్లీలో, దుబాయ్‌లో ఎక్కడెక్కడ తిరిగారో అంరదికీ తెలుసని విమర్శించారు. ఇవన్నీ ఆరోపణలు కాదని, వాస్తవాలని కౌశిక్‌ రెడ్డి అన్నారు.

కౌశిక్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాలి, లేదంటే బట్టలూడదీసి కొడతాం

సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఆరోపణలను నిరాధారమని, వెంటనే కౌశిక్‌ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. కౌశిక్‌ రెడ్డి క్షమాపణ చెప్పకుంటే బట్టలూడదీసి, ఉరికిచ్చి కొట్టే బాధ్యత హుజూరాబాద్‌ ప్రజలు తీసుకుంటారని బల్మూరి వెంకట్‌ హెచ్చరించారు.

Read Also:

  1. నా జోలికొస్తే నరికేస్తా, టౌన్‌ప్లానింగ్‌ సిబ్బందికి బెదిరింపులు
  2. బీసీ రిజర్వేషన్లపై ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోంది: కిషన్‌రెడ్డి
  3. తెలంగాణలో ఈ-గవర్నెన్స్‌కు ఎస్తోనియా సపోర్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button