HomeజాతీయంMK Stalin: మూడు నెలలైనా ఉంటుందా? టీవీకే ప్రభుత్వంపై స్టాలిన్ షాకింగ్ కామెంట్స్!

MK Stalin: మూడు నెలలైనా ఉంటుందా? టీవీకే ప్రభుత్వంపై స్టాలిన్ షాకింగ్ కామెంట్స్!

డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం భవిష్యత్తుపై ప్రజల్లోనే అనుమానాలు మొదలయ్యాయని అన్నారు. ప్రభుత్వం మూడు నెలలైనా కొనసాగుతుందా? అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోందని వ్యాఖ్యానించారు.

విజయ్ సర్కారుపై స్టాలిన్ షాకింగ్ కామెంట్స్

తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్, టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఆరు నెలల పాటు విమర్శలు చేయకూడదని తమ పార్టీ నిర్ణయించుకుందని తెలిపారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయని చెప్పారు. “ఐదు, ఆరు నెలలు కాదు, ఈ ప్రభుత్వం మూడు నెలలైనా నిలబడుతుందా అనే సందేహం ప్రజల్లో కనిపిస్తోంది. ప్రభుత్వ పనితీరు ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయం పెరుగుతోంది” అని స్టాలిన్ అన్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలతో పెద్దగా మమేకం కాకుండా, పార్టీ స్థాయిలో పూర్తి స్థాయి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయకుండా అధికారంలోకి వచ్చిన పార్టీ ఎక్కువ కాలం నిలబడటం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. బూత్ ఏజెంట్ల నియామకం వంటి ప్రాథమిక రాజకీయ కార్యకలాపాల్లో కూడా టీవీకే బలహీనంగా కనిపించిందని విమర్శించారు.

మా మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోంది!

అదే సమయంలో టీవీకే ప్రభుత్వానికి తమ కూటమిలోని కొన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తోందని స్టాలిన్ గుర్తుచేశారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే తమ మిత్రపక్షాలకు టీవీకేకు మద్దతు ఇవ్వడానికి అవకాశం కల్పించామని చెప్పారు. తాము అలా చేయకపోయి ఉంటే రాష్ట్రంలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగేదని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగడానికి తమ కూటమి భాగస్వామ్య పార్టీల మద్దతు కూడా ఒక కారణమన్నారు. స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. టీవీకే ప్రభుత్వం భవిష్యత్తు, కూటమి రాజకీయాలు, ప్రతిపక్షాల వైఖరి లాంటి అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు