
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- రంగారెడ్డి జిల్లాలోని మిర్జాపూర్ వద్ద బస్సు ప్రమాదం జరిగిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ప్రమాదంలో జరిగిన నిజ నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా ధ్వంసం అయింది. ముఖ్యంగా కూడి వైపు ఉండే భాగం ఆనవాళ్లు లేకుండా పోవడంతో ప్రమాద తీవ్రత ఎంత ఉందనేది అర్థం చేసుకోవచ్చు. కొద్ది టన్నుల బరువు ఉండేటువంటి కంకర మీద పడడంతో ప్రయాణికులు వాటికిందే సమాధి కూడా అయ్యారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూతుళ్లు కూడా చనిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వారి అంత్యక్రియలు ప్రతి ఒక్కరిని కూడా కన్నీరు పెట్టిస్తున్నాయి.
Read also : మేము ఎవరికి అనుచరులం కాదు.. అది రెడ్డి అయినా?.. రావు అయినా? : అక్బరుద్దిన్
అయితే తాజాగా ఈ ప్రమాదం గురించి టిప్పర్ యజమాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ బస్సు ప్రమాదం చోటుచేసుకుంది అని కీలక వ్యాఖ్యలు చేశారు. బస్సు డ్రైవర్ చాలా వేగంగా వస్తూ గుంతం తప్పించిపోయి మా పైకి దూసుకు వచ్చాడు అని.. వెంటనే డ్రైవర్ ఆకాశ్ నన్ను నిద్రలో నుంచి లేపుతున్న సమయంలోనే బస్సు మా టిప్పర్ ను ఢీకొట్టింది అని వెల్లడించారు. కానీ చాలామంది మా డ్రైవర్ మద్యం తాగి వాహనం నడుపుతున్నాడు అని.. గుంతను తప్పించిపోయి బస్సును ఢీకొట్టారు అని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు అని యజమాని లక్ష్మణ్ నాయక్ తెలిపారు. అయితే ఈ ప్రమాదంపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఒక్కొక్క నిజం వెలుగులోకి వస్తుంది. మరి ఇవి ఎంత వరకు నిజమనేది పోలీసులే తేల్చాల్సి ఉంది.
Read also : KCR ను జైల్లో వేస్తామని మీకు చెప్పామా.. రేవంత్ కు కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి!





