తెలంగాణ
Trending

అలాంటి వాళ్లే రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారు.. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తాను చదువుకుంటున్న రోజుల్లో నక్సలైట్ అవుతానని అనుకోలేదని.. అప్పటి పరిస్థితుల ప్రభావంతో అడవి బాట పట్టాల్సి వచ్చిందంటూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీతక్క అలియాస్ ధనసరి అనసూయ జీవితం నేపథ్యంతో అస్నాల శ్రీనివాస్ రాసిన “రణధీర సీతక్క” పుస్తకావిష్కరణ కార్యక్రమం హనుమకొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క.. తన జీవితంలో పలు సందర్భాలను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే విప్లవంలో దిగానని.. అప్పడి నుంచి ఇప్పటి వరకు ప్రజాసేవలో ఉన్నానని సీతక్క తెలిపారు.

Read Also : సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా భేటీ.. నేడో, రేపో కాంగ్రెస్‌లో చేరే అవకాశం!!

పేదలను అసహ్యించుకునే వాళ్లు రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారని కీలక కామెంట్ చేశారు. పేదరిక నిర్మూలన జరిగితేనే తన లక్ష్యం నెరవేరినట్టని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. రాజకీయ నేతలు తప్పులు చేస్తే మేధావివర్గం తట్టి చెప్పడానికి ముందుకు రావాలని చెప్పుకొచ్చారు. రాజకీయంగా తనను ఎదుర్కునే సత్తాలేకనే కొందరు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. తనను దెబ్బకొట్టాలని పదేపదే దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు పంపించినట్టు చెప్పుకొచ్చారు.

Also Read : తెలంగాణలో నామినేటెడ్‌ పదవుల భర్తీ.. 37 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం!!

రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి గోండులకు అవకాశం రాలేదని.. ఎవ్వరూ మంత్రి కాలేదన్నారు. ఇప్పుడు తనకు ఆ పదవి వస్తే బీఆర్ఎస్ వాళ్లు ఓర్వటం లేదని ఆరోపించారు. తన ఉద్యమ జీవితాన్ని కూడా కించపరిచే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అధికారిక ఖాతాలో పెట్టిన పలు పోస్టులు తనను ఉద్దేశించే పెట్టారని సీతక్క ఆరోపించారు. వాటికి బాధ్యతగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సీతక్క నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే.. సీతక్క పంపించిన లీగల్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాకపోవటం గమనార్హం.

ఇవి కూడా చదవండి : 

  1. డిఫాల్ట్ బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌.. శుక్రవారానికి వాయిదా!!
  2. గాంధీభవన్‌లో ఘనంగా వైఎస్‌ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన సీఎం, డిప్యూటీ సీఎం!!!
  3. కేకేకు కీలక పదవి.. కేబినెట్ హోదాతో పదవి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!!
  4. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ…
  5. బీఆర్ఎస్‌కి భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

Originally posted 2024-07-08 11:30:56.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button