
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- ప్రపంచంలో ఎన్నో అతి భారీ భూకంపాలు సంభవించాయి. కానీ వాటిలో కొన్ని మాత్రం ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది. అలాంటివి ఒక మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కువ తీవ్రతతో వచ్చినటువంటి భూకంపాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రపంచంలో అతిపెద్ద భూకంపాలు ( తీవ్రత పరంగా )
1. 1960 చిలీ లో 9.4 – 9.6 తీవ్రత
2. 1964 అలస్కా లో 9.2 – 9.3 తీవ్రత తో
3. 2004 ఇండోనేషియా లో 9.2 తీవ్రతతో
4. 2011 జపాన్ లో 9.1 తీవ్రతతో
5. 1952 రష్యా లో 9.0 తీవ్రతతో
6. 2010 చిలీలోని బయోబియోలో 8.8 తీవ్రతతో
7. 1906 ఈక్వేడర్ లో 8.8 తీవ్రతతో
8. 2025 అనగా నేడు రష్యాలో 8.8 తీవ్రతతో
9. 1965 అలస్కా లో 8.7 తీవ్రతతో
10. 1950 ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 8.6 తీవ్రతతో
11. 2012 సుమత్ర, ఇండోనేషియాలో 8.6 తీవ్రతతో… భారీ భూకంపాలు అనేవి సంభవించాయి.
పైన మనం చెప్పుకున్న విధంగా ప్రతి ఒక్క భూకంపం కూడా చాలా నష్టాన్ని మిగిల్చాయి. కాగా ఇండోనేషియా, చిలీలో, రష్యా లో ఎక్కువ తీవ్రతతో ఎక్కువసార్లు భూకంపాలు సంభవించాయి. కాబట్టి ఈ లెక్కన ఈ దేశాల్లోనే ఎక్కువగా భూకంపాలు అనేవి సంభవిస్తున్నాయి. అవి కూడా ఎక్కువ తీవ్రతతో రావడంతో… ఆ భూకంప తీవ్రతకు భారీ నష్టాలను ఈ దేశాలు కళ్ళారా చూసాయి. కాబట్టి ప్రపంచం లోనే అతిపెద్ద భూకంపాలు ఇవే. కాగా నేడు రష్యాలో జరిగిన భూకంప కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా భయాందోళనకు గురయ్యాయి. కానీ ఇండియాకు ఎలాంటి భూకంపం ముప్పు లేదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తాజాగా తెలిపింది.