హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి ఎంఐఎం ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. జీహెచ్ఎంసీ అధికారులకు చుక్కలు చూపించాడు. తాను చెప్పినట్లే చేయాలని వార్నింగ్ ఇచ్చాడు. మేయర్ ఆదేశాలు పాతబస్తీలో నడవవని చెప్పారు. పాత బస్తీలో జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులకు ఎదురు దెబ్బ తగిలింది. దుకాణాల మూసివేత విషయంలో ఎంఐఎం నేతల బెదిరింపులతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెనక్కి తగ్గారు..
సీజ్ చేసిన చికెన్, మటన్ షాపులు తెరవక పోతే ఉద్యోగాలు పోతాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులను మజ్లిస్ ఎమ్మెల్సీ బేగ్ బెదిరించారని తెలుస్తోంది. ఇంకోసారి తమ దుకాణాలపై దాడులు చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించాడట. ఎమ్మెల్యే అండతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసిన 24 గంటల్లోనే కోఠి, మోతి మార్కెట్ లోని చికెన్, మటన్ షాపులు తెరుచుకున్నాయి.
రెండ్రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాలను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తనిఖీ చేశారు. తనిఖీల సమయంలో చికెన్‌ను తింటున్న ఎలుకలను చూసి మేయర్ అవాక్కయ్యారు. పలు చికెన్ షాపుల్లో చనిపోయిన కోళ్లను సైతం అమ్ముతున్నట్లు గుర్తించిన మేయర్.. కుళ్లిన చికెన్ అమ్ముతున్న వారిపై చర్యల తీసుకోవాలని ఫుట్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. దీంతో, అధికారులు పలు దుకాణాలను మూసి వేశారు.
అయితే మూసి వేసిన 24 గంటల్లోనే షాపుల వ్యాపారులు దుకాణాలను తిరిగి తెరిచారు. కనీసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు పెనాల్టీలు సైతం వ్యాపారులు చెల్లించ లేదు. మేయర్ ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోక పోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. అధికారులపై ఎంఐఎం ఎమ్మెల్యే బేగ్ బెదిరింపులకు దిగడం తోనే వ్యాపారులు తమ దుకాణాలు తెరిచారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని వార్తలు చదవండి…
బఫర్ జోన్‌లో హైడ్రా కమిషనర్ ఇల్లు! క్లారిటీ ఇచ్చిన రంగనాథ్
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్
డేంజర్ లో హైదరాబాద్.. బయటికి వస్తే అంతే
రైతుల సంబరం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం
రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!