
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి హైదరాబాదులో అడుగు పెడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నెల 13వ తేదీన మెస్సి హైదరాబాదులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే మెస్సి హైదరాబాద్ పర్యటన గురించి ప్రతి ఒక్కరు కూడా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు మెస్సి మెస్సి హైదరాబాద్ షెడ్యూల్ ను వివరించారు. డిసెంబర్ 13వ తేదీన సాయంత్రం 4 గంటలకు మెస్సి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత ఓ స్టార్ హోటల్లో కాసేపు రెస్ట్ తీసుకుంటారు. ఇక అదే రోజు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకొని సీఎం రేవంత్ రెడ్డితో సరదాగా కాసేపు ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ కు చాలా మంది హాజరుకానున్నారు. ఆ తర్వాత వెంటనే స్కూల్ పిల్లలతో కొద్దిసేపు ఇంటరాక్షన్ అనేది ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం మెస్సి కీ ఘనంగా పరేడ్ మరియు సన్మానం నిర్వహించనున్నారు. ఫుట్బాల్ మ్యాచ్ ఆడిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు హైదరాబాదులోనే పర్యటించి అదే రోజు రాత్రి తిరిగి పయనమవుతారు అని సమాచారం.
Read also : నేడు అర్ధరాత్రి నుంచి లారీలు బంద్… లారీ ఓనర్ల సంఘం కీలక ప్రకటన!
Read also : BREAKING: తగ్గిన బంగారం ధరలు.. వెండి ధర మాత్రం పైపైకి





