క్రైమ్

భార్యను ముక్కలుగా నరికి.. కాల్చి.. పొడిగా చేసిన భర్త,, హైదరాబాద్ లో కిరాతకం

హైదరాబాద్ మీర్ పేట జిల్లెలగూడలో కిరాతక ఘటన జరిగింది. అతికిరాతకంగా భార్యను హత్య చేశాడు భర్త గురుమూర్తి. హత్య చేసి డెడ్ బాడీని కుక్కర్ లో ఉడక పెట్టాడు కసాయి భర్త. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. భార్య పై అనుమానంతో ముక్కలు,ముక్కలుగా నరికి జిల్లెల్లగూడ చందన చెరువు లో పడేశాడు భర్త
ఈ సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి(EX- ఆర్మీ)వృత్తి రీత్యా డి ఆర్ డి ఓ(DRDO)లో ఔట్సోర్సింగ్ సెక్యూరిటీ వృత్తి నిర్వహిస్తూ జిల్లెల్లగూడ లోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవి(35)తో నివాసముంటున్నారు వీరికి ఇద్దరు పిల్లలు.ఈనెల 13న మిస్సింగ్ అయినట్టు మీరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు మృతురాలి తల్లిదండ్రులు. ఫిర్యాదు చేస్తున్న సమయం లో తనకు ఏం తెలియదు అన్నట్టుగా అత్తమామలతో కలిసి మీర్పేట పిఎస్ కు వచ్చాడు హంతకుడు, మృతురాలి భర్త గురుమూర్తి. తన భార్యను చంపడానికి ముందు కుక్కను చంపి తర్వాత భార్యను హతమార్చినట్లు సమాచారం. వివరాలను గోప్యంగా ఉంచుతున్న పోలీసులు.

జిల్లెలగూడ వెంకట మాధవి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. భార్యను చంపేసి ముక్కలుగా కట్ చేసిన గురుమూర్తి .. కమర్షియల్ సిలిండర్ తీసుకోనీ వచ్చి మృతదేహం ముక్కలను ఉడకబెట్టాడు. ముక్కలను ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చాడు గురుమూర్తి. మృతదేహం పొడిని బకెట్ తీసుకువెళ్లి చెరువులో కలిపివేశాడు గురుమూర్తి. మృతదేహం పొడి కోసం చెరువులో గాలిస్తున్నారు పోలీసులు. ముక్కలతోపాటు బాడీ మొత్తాన్ని పొడిగా మార్చడం వల్ల ఆనవాళ్లు దొరకడం లేదు.సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు ఇంట్లో మృతదేహాన్ని కోసి కాల్చివేసి పొడిగా మార్చాడు గురుమూర్తి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button