క్రైమ్ మిర్రర్, సినిమా:- ఇరుముడి సినిమా తర్వాత మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న సరికొత్త చిత్రం తాజాగా ప్రారంభమైంది. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ సినిమాకు ‘తులాభారం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ విడుదల చేసిన స్పెషల్ టైటిల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియాంక మోహన్ మరియు అనస్వర రాజన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి, టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండటం విశేషం. వివేక్ ఆత్రేయ మార్క్ టేకింగ్, రవితేజ మాస్ ఎనర్జీ కలగలిపి వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
రెట్టింపు లాభాల ఆశ చూపి.. రూ.10 కోట్లకు టోకరా!
ఢిల్లీలో నిరసనకారులపై హిందూ రక్షా దళ్ వ్యక్తుల దాడి.. నలుగురి అరెస్ట్
