ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ సంగతి తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. పవన్ కేవలం కాపులకు మాత్రమే పెద్దన్న అంటూ హాట్ కామెంట్స్ చేశారు మందకృష్ణ మాదిగ. అయితే సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత మందకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.
విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో దాదాపు గంట సేపు చర్చలు జరిపారు మంద కృష్ణ మాదిగ. అనంతరం మీడియా మాట్లాడారు. ఈ సందర్భంగానే పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మందకృష్ణ. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ నోటి నుంచి ఆ విధంగా రావడం దురదృష్టకరమన్న మంద కృష్ణ.. మాదిగ మహిళ అనితను అవమానిచినట్లే కదా అని అన్నారు.ఈ విషయాన్ని తాము దృష్టిలో పెట్టుకుంటామని చెప్పారు.
ఎన్నికల సమయంలోనే పవన్ పట్ల తాము అసంతృప్తిని వ్యక్తం చేశామన్నారు మందకృష్ణ మాదిగ. పవన్ కళ్యాణ్ కాపులకు పెద్దన్నఏమో కాని మాదిగలకు కాదన్నారు. మాదిగలకు జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదన్నారు. జనసేనకు మూడు మంత్రి పదవులు ఇస్తే దళితుడికి ఇవ్వలేదన్నారు. పవన్ కళ్యాణ్ తన శాఖ సరిగా చేయలేదని ఇంకో మంత్రి అంటే ఎలాగా వుంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ను నీ శాఖను నేను తీసుకుంటానని మరొక మంత్రి ఎంటే ఎలా వుంటుందని నిలదీశారు. పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టమన్నారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటే సిఎం చంద్రబాబును అన్నట్లు కాదా అని మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు.
మరిన్ని వార్తలు చదవండి ..
- కన్నీళ్లతో వైఎస్ విజయమ్మ వీడియో.. జగన్ అంత పని చేశాడా!
- స్టేజీపై తన పేరు చెప్పలేదని అలిగి వెళ్లిపోయిన ఎంపీ
- పవన్‌ను అడ్డుకోవడంతో రాజమండ్రిలో ఉద్రిక్తత
- విజయమ్మ హత్యకు జగన్ స్కెచ్? టీడీపీ సంచలన ట్వీట్
- తీన్మార్ మల్లన్నపై రేవంత్ గురి.. ఆర్ కృష్ణయ్యతో స్కెచ్!
- ఆరు రెడ్డి కుటుంబాల సంగతి తేలుస్తా.. నల్గొండలో గర్జించిన తీన్మార్ మల్లన్న
- సీఎం రేవంత్‌ను లైట్ తీసుకున్న వరంగల్ ఎమ్మెల్యేలు.. పొంగులేటికి రెడ్ కార్పెట్