-
ఉచిత బస్సులతో వేములవాడకు భక్తుల తాకిడి
-
ఆదరిస్తే వేములవాడ మరింత అభివృద్ది
-
కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా
ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ
వేములవాడ, క్రైం మిర్రర్ః
వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వేములవాడ దేవస్థానం మరింత అభవృద్ది చెందుతుందని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపెల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ కోరారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తుందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల వేములవాడ పట్టణానికి భక్తుల తాకిడి పెరిగి పట్టణవాసులకు ఆర్థికంగా మేలుకలిగిందన్నారు.
ప్రతి కుటుంబానికి సన్న బియ్యం…
గెలిచిన రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం, రేషన్ కార్డు లేని వానికి రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు.
సన్న వడ్లకు 500 బోనస్, రైతు భరోసాకల్పిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందన్నారు.
అభివృద్ది జరుగాలంటే మున్సిపాలిటిలో కాంగ్రె్ ప్రభుత్వమే ఉండాలనికోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో వేములవాడను మరింత అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.





