
Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ గెలుపును ఆమె తీవ్రంగా నిరసిస్తూ, ఈ ఎన్నికలు పూర్తిగా అప్రజాస్వామిక వాతావరణంలో జరిగాయని ఆరోపించారు. రౌడీలతో భయపెట్టి ఓట్లను ప్రభావితం చేశారని, అనేక రిగ్గింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. నాలుగు, ఐదు పార్టీలు కలసి పోటీ చేసిన సందర్భంలో తాను ఒంటరిగా బరిలో దిగినా నైతిక విజయం బీఆర్ఎస్‌దే అని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు గొడవలు, బెదిరింపులు, కౌంటింగ్ సెంటర్‌లో ర్యాగింగ్ జరిగాయని ఆమె ఆరోపించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి.
తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు బెదిరింపులకు గురయ్యారని, ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందినదని సునీత వ్యాఖ్యానించారు. గోపినాథ్ హయాంలో శాంతిగా ఉన్న జూబ్లీహిల్స్, ఇప్పుడు రౌడీయిజానికి అడ్డాగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని అభినందిస్తూ, తాను ఎల్లప్పుడూ ప్రజా సేవలో అందుబాటులో ఉంటానని తెలిపారు. స్వర్గీయ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆశయాల కోసం ముందుకుసాగుతానని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ALSO READ: జూబ్లీహిల్స్ ఓటమిపై కిషన్ రెడ్డి స్పందన





