-
*ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు*
-
*మద్యం మత్తులో మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తనకు శిక్ష తప్పదు*
-
*విలువైన జీవితం, భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోకండి*
-
*ఎలాంటి పరిస్థిలో డయల్ 100 కు కాల్ చెయ్యండి*
-
*ప్రజలకు పోలీసు శాఖ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది*
-
*మండల ఎస్ఐ ఎస్. కృష్ణయ్య*
*క్రైమ్ మిర్రర్,మాడుగులపల్లి ప్రతినిది:* నూతన సంవత్సర వేడుకల పేరుతో అర్ధరాత్రి పూట రోడ్లపై కేకులు కట్ చేయడం, టపాసులు కాల్చడం, మద్యం మత్తులో అల్లర్లు సృష్టించడం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే తప్పకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం అని ఎస్ఐ ఎస్.కృష్ణయ్య అన్నారు.
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పోలీస్ స్టేషన్ నుండి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్బంగా నూతన సంవత్సర వేడుకల పై మండల ప్రజలకు పలు సుచానాలు చేశారు. మద్యం మత్తులో మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించడం, బైక్ సైలెన్సర్ సౌండ్లు, అనవసర హారన్ శబ్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, రహదారులపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం వంటి చర్యలపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేయడంతో పాటు జైలుశిక్ష వరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించారు. ప్రజలు తమ విలువైన జీవితం, భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోకుండా, శాంతియుతంగా, చట్టాలను పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి అని సూచించారు.
చట్టం ఉల్లంఘిస్తే కఠిన పరిణామాలు తప్పవు అని అన్నారు. ప్రజలకు పోలీసు శాఖ ఎప్పుడు అందుబాటులో అండగా ఉంటుంది అన్నారు. ఏమైన ఇబ్బందులు ఎదురైనచో డయల్ 100 కు కాల్ చేసి సంప్రదించగలరు అని తెలియజేశారు.





