పుష్ప హీరో అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వివాదంలోకి హీరోయిన్ మాధవీలత ఎంట్రీ ఇచ్చార. బన్నీ మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డిని ఏకిపారేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్నలు సంధించారు నటి మాధవీలత. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు.. ఆయనకి తెలియకుండా జరిగిందన్నారు. కాని దాని మీద సరిగా స్పందించకపోవడం అల్లు అర్జున్ చేసిన పొరపాటు అన్నారు మాధవీలత.
తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ఏడు రోజు సంతాప దినాలు
తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉందన్నారు మాధవీలత. నిన్న మెదక్ జిల్లాలో ఒక చిన్న పాపను రేప్ చేశారంట దాని గురించి మాట్లాడి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ లని నిలదీస్తారా? అని ప్రశ్నించారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల వల్లే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా అని లెటర్ రాసి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు పాతిక లక్షలు కాకపోయినా పాతిక వేలు అయినా ఇచ్చారా? అని ముఖ్యమంత్రిని నిలదీశారు మాధవీలత. పొద్దు తిరుగుడు పువ్వు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సాయం చేశారా? అన్నారు.
టాలీవుడ్ పెద్దలను గంట వెయిట్ చేయించిన రేవంత్ రెడ్డి!
జరిగిన తప్పుకి ఇండస్ట్రీ మీద ఉక్కు పాదం మోపాలి, వాళ్ళని కాళ్ళ కింద పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని మాధవీలత మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక సినిమా వాళ్లందరినీ పిలిపించుకొని ఫోజులు కొట్టి దండం పెట్టించుకున్నట్లు మనం సీఎం అయ్యాక ఎందుకు చేయించుకోకూడదు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి పైకొచ్చి ఈ స్థాయికి వచ్చాక ఎందుకు ఇంత గలీజుగా బిహేవ్ చేస్తున్నారని మాధవీలత మండిపడ్డారు. గురుకుల పాఠశాలల్లో ఎంతోమంది చనిపోతే ఏనాడైనా మాట్లాడిన పాపాన పోలేదు..అందరికీ ఒకేలాగా స్పందించండని సూచించారు. ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలయించాలని చూస్తున్నారు అంతేగా..సినిమా బతుకులు అంతా వచ్చి మీ కాళ్ళు మొక్కుతరు అంటూ మాధవీలత ఘాటు వ్యాఖ్యలు చేశారు.