HomeతెలంగాణTemples Closed: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. దర్వేశిపురం యల్లమ్మ అమ్మవారి ఆలయం మూసివేత!

Temples Closed: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. దర్వేశిపురం యల్లమ్మ అమ్మవారి ఆలయం మూసివేత!

  • చంద్రగ్రహణం కారణం ఆలయాల మూసివేత

  • నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు క్లోజ్ చేసిన పండితులు!

చంద్రగ్రహణం కారణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆలయాలను మూసివేశారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సహా అన్ని ఆలయాలను పండితులు క్లోజ్ చేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయం శుద్ది చేసిన అనంతరం మళ్లీ ఆలయాలను తెరవనున్నట్లు ఆలయ పూజారులు వెల్లడించారు.

దర్వేశిపురం యల్లమ్మ ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా దర్వేశిపురం శ్రీ యల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని పండితులు మూసివేశారు. ఈరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటలకు వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి రేపు (మార్చి 4, బుధవారం) ఉదయం 8 గంటలకు ఆలయ సంప్రోక్షణ తరువాత భక్తులకి దర్శనం భాగ్యం ఉంటుందన్నారు. ఆలయం మూసివేత కార్యక్రమంలో  ఆలయ కార్యనిర్వాహణాధికారి అంబటి నాగిరెడ్డి, ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారీ, అర్చకులు గాదె దామోదర్ రావు, చోల్లేటి శ్రీనివాసచారీ, జూనియర్ అసిస్టెంట్ కుసం ఉపేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

దర్శనం కోసం వచ్చి వెనుదిరిగిన భక్తులు

అటు ఇవాళ మంగళవారం కావడంతో భక్తులు యథావిధిగా యల్లమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. అయితే, చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్నిమూసివేయడంతో.. బయటే కొబ్బరికాయలు కొట్టి, అక్కడి నుంచే మొక్కుకుని వెళ్లిపోతున్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు