
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ అర్ధరాత్రి నుంచి లారీలు బంద్ కానున్నట్లు లారీ ఓనర్ల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎందుకంటే.. ఈమధ్య టెస్టింగ్ మరియు ఫిట్నెస్ చార్జీలను గణనీయంగా పెంచడంతో సంపాదించిన డబ్బు మొత్తం వీటికి పెట్టాల్సి వస్తుంది అని లారీ ఓనర్లు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ టెస్టింగ్ మరియు ఫిట్నెస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేస్తున్నట్లుగా లారీ ఓనర్ల సంఘం ఈ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పదివేల లారీలు ఈ ప్రకటనతో నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం మనం ప్రతిరోజు ఉపయోగించేటువంటి నిత్యవసరాల సరుకుల పై పడేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గూడ్స్ రవాణా చేసేటటువంటి లారీలు నిలిచిపోవడంతో కూరగాయలు, ధాన్యం, రేషన్ సరఫరా అలాగే నిత్యవసరాలపై తీవ్ర ప్రభావము అనేది పడనుంది. కాగా 13 సంవత్సరాల వాహనాల ఫిట్నెస్ ఫీజు గతంలో 1400 రూపాయలు ఉండగా కొత్త నిబంధనల ప్రకారం 33 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది అని లారీ ఓనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వాలు ఈ విషయంపై స్పందించి చార్జీలను తగ్గిస్తామని హామీ ఇవ్వాలి అని కోరారు.
Read also : రేపటి నుంచే సోషల్ మీడియా బంద్.. ఎక్కడంటే?
Read also : నేడే మొదటి టీ20.. ఎవరి బలమెంత?





