
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడు మండల కేంద్రానికి చెందిన నడిపల్లి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సంప్రదించగా సీఎం సహాయనిది నుండీ వెనువెంటనే 2 లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించారు. మంగళవారం యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జితేందర్ రెడ్డి,పందుల నరసింహ, మిరియాల వెంకటేశ్వర్లు,జిట్టగోని యాదయ్య, సాగర్ల లింగస్వామి, ఎండి అన్వర్ లతో కలిసి బాధితుడు నడిపల్లి శ్రీనివాస్ కు ఎల్ఓసి అందజేశారు. నడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అపద సమయంలో ఆదుకున్న ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి రుణపడి వుంటామని అన్నారు. చిలువేరు సుదర్శన్.పందుల మల్లేష్, జిట్టగోని రాజు,దుబ్బ రవి,వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
Read also : ముక్కోటి ఏకాదశి వేడుకలు: రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
Read also : అల్లు అర్జున్ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తుందా?





