
-42% రిజర్వేషన్లు సాధించే వరకూ పోరాటం
-కాంగ్రెస్ తోనే వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం
మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:- రేపు శనివారం (18న) బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి చట్టసభలకు పంపే వరకు కేంద్రంపై పోరుబాట తప్పదని కిచ్చెన్న హెచ్చరించారు. అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. రేపు బీసీ సంఘాలు నిర్వహించే బంద్ లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని కేఎల్ఆర్ కోరారు. రెండు నాల్కల ధోరణితో వదిలి రాష్ట్ర బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు… బీసీ బిడ్డలకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కిచ్చెన్నగారు సూచించారు.
Read also : అద్భుతమైన రాజధానిగా అమరావతి.. త్వరలోనే స్టార్ హోటళ్లు!
Read also : బంద్ పేరిట అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠినమైన చర్యలు : డీజీపీ శివధర్ రెడ్డి