శ్రీశైలంలో భక్తులపై లాఠీ చార్జి.. బీజేపీ ప్రెసిడెంట్ రియాక్షన్ ఇదే?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఏపీలోని శ్రీశైలం దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన విషయం ప్రతి ఒకరికి తెలిసిందే.అయితే ఈ ఉత్సవాల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగా కొంతమంది పై పోలీసు అధికారులు వారిపై లాఠీ చార్జీ చేశారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్ ఈ విషయంపై స్పందించారు. శ్రీశైలంలో నిన్న జరిగినటువంటి లాఠీచార్జి ను తీవ్రంగా ఖండిస్తున్నాము అని అన్నారు. భక్తులపై లాఠీచార్జికి పాల్పడ్డటువంటి పోలీసు అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అని తెలిపారు. శివరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీశైలం క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్న వేళ వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఎక్కువసేపు పాటు క్యూలైన్లో నించోవాల్సి వస్తుంది అని.. 24 గంటలు అవుతున్నా కూడా దర్శనం అవ్వట్లేదు అని కొంతమంది మాల ధరించినటువంటి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన సమయంలో ఈ లాఠీ ఛార్జ్ జరిగినట్లుగా సమాచారం. సోమవారం కావడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి అధిక మంది భక్తులు వచ్చారు అని.. ఈ సందర్భంలోనే రద్దీతోపాటు కాస్త ఇబ్బందులు పడ్డారు అని మాధవ్ స్పష్టం చేశారు. భక్తుల విషయంలో పోలీసులు సమన్వయం పాటించాలి అని.. భక్తులే ఎక్కువగా తరలివస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ మరిన్ని ఏర్పాట్లు కూడా చేయాలి అని సూచించారు. మహాశివరాత్రికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండగా ఇప్పటినుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మాల విరమణ చేసేటువంటి భక్తులు కూడా చాలామంది రావడంతో వారికి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు మరింత ఉదృతం చేయాలి అని సూచించారు.

డివైడర్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

సింగరేణి రిటైర్ట్ కార్మికుల‌కు 10వేలు పెంచాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button