అంతర్జాతీయం

Mallya London Party: భారత్ నుంచి పారిపోయిన పెద్దలు, బర్త్ డే పార్టీలో ఎంజాయ్!

విజయ్ మాల్యా, లలిత్ మోడీ పార్టీ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వేడుకలో బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

విజయ్ మాల్యా, లలిత్ మోడీ కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ మాల్యా 70వ పుట్టిన రోజు సందర్భంగా లలిత్ మోదీ తన నివాసంలో ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భారత్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొని దేశం నుంచి లండన్ పారిపోయి తల దాచుకుంటున్నరు. విజయ్ మాల్యా 70వ పుట్టిన రోజు సందర్భంగా లలిత్ మోడీ తన నివాసంలో ఓ పార్టీ ఇచ్చారు. ఇందులో పలువురు ప్రముఖులు సందడి చేశారు.

భారత్ నుంచి పారిపోయిన పెద్దలం  

ఈ పార్టీలో భారత్ మీద సెటైర్లు వేస్తూ తాను మాట్లాడిన వీడియోను లలిత్ మోడీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో లలిత్ మోడీ తనను, విజయ్ మాల్యాను భారత్ నుంచి పారిపోయిన అతి పెద్ద వ్యక్తులుగా పరిచయం చేసుకున్నారు. “భారతదేశంలో మళ్ళీ ఇంటర్నెట్‌ను బ్రేక్ చేద్దాం. మీ హృదయం అసూయతో నిండిపోయేలా ఒకటి ఇస్తున్నా మీడియా ఫ్రెండ్స్. పుట్టినరోజు శుభాకాంక్షలు మై ఫ్రెండ్ విజయ్ మాల్యా. లవ్ యు” అంటూ లలిత్ మోడీ చెప్పుకొచ్చాడు.

https://www.instagram.com/reel/DSivCM3DPOV/

లలిత్ మోడీ కామెంట్స్ పై నెటిజన్ల ఆగ్రహం

లలిత్ మోడీ వ్యాఖ్యలు భారత్‌పై వేసిన సెటైర్లుగా చాలా మంది పరిగణిస్తున్నారు.  లలిత్ మోడీ, విజయ్ మాల్యా ఇద్దరినీ స్వదేశానికి తీసుకురావడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న భారత ప్రభుత్వాన్ని ఈ పోస్ట్ ఎగతాళి చేస్తున్నట్లు ఉంది. లలిత్ మోడీ పోస్ట్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ సంపదను దోచుకుని ఆర్థిక నేరాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button