
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రం, హనుమకొండ జిల్లా, వంగర గురుకులంలో పదవ తరగతి చదువుతున్న వర్షిత అనే విద్యార్థి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అయితే ఈ వర్షిత అనే విద్యార్థిని అంబులెన్స్ రాకపోవడంతో ట్రాక్టర్ లో తరలించడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి స్థితిలో కూడా ప్రభుత్వానికి సానుభూతి లేకపోతే ఇంకెవరూ ఏం చేయలేరు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ఏకంగా 100 మంది పిల్లలు చనిపోయారని రేవంత్ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. ఒక స్కూల్ టాపర్ అయినటువంటి వర్షిత శుక్రవారం నాడు హాస్టల్లో సూసైడ్ చేసుకోవడం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. విద్యార్థిని తీసుకువెళ్లడానికి కనీసం అంబులెన్స్ రాకపోవడంతో చేసేదేం లేక వర్షిత అనే విద్యార్థిని ట్రాక్టర్ లోనే ఇంటికి తరలించారు. అయితే వర్షిత అనే విద్యార్థిని ట్రాక్టర్ లో తరలిస్తున్న సమయంలో పక్కనే ఉన్నటువంటి టీచర్లు మరియు విద్యార్థులు ఒక్కసారిగా బోరున ఏడ్చేశారు. ఇన్నాళ్ళు స్కూళ్లలో అందరి ముందు ఆనందంగా గడిపిన వర్షిత ఇక లేదని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా బాగోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరినీ కూడా కన్నీటి సంద్రంలోకి నింపేలా చేసింది.
Read also : సీఎం రేవంత్ కు మరో మంత్రి ఝలక్.. తలపట్టుకున్న హైకమాండ్
Read also : రేవంత్ కు షాక్.. నవంబరు 3 నుంచి అన్ని కాలేజీలు బంద్





