తెలంగాణ

కేటీఆర్‌ది ఒక బతుకేనా.. ఫాల్తూ నా కొడకు.. బండి సంజయ్ ఉగ్రరూపం

రాష్ట్రంలో రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అందులో భాగంగానే గ్రూప్ 1 పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను వర్తింపజేయకుండా జీవో నెంబర్ 29 జారీ చేసిందన్నారు. డిసెంబర్ 9 సోనియాగాంధీ జన్మదినం నిరుద్యోగుల పాలిట బలిదినం కాబోతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా… రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు 29 జీవోను ఎత్తివేసి, గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేసేందుకే తాము ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. బీజేపీపట్ల నిరుద్యోగులు చూపుతున్న స్పందనను చూసి ఓర్వలేక… బీఆర్ఎస్ నేతలు తమ ర్యాలీలో చొరబడి విధ్వంసం చేసేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు.

నిరుద్యోగుల పక్షాన తాను పోరాడుతుంటే… కేటీఆర్ పిచ్చికుక్కలా మొరుగుతున్నాడని నిప్పులు చెరిగారు బండి సంజయ్. ‘కేటీఆర్.. నువ్వో యూజ్ లెస్ ఫెలో…నేను పోరాడుతుంటే నాపై వ్యక్తిగత దూషణలు చేస్తావా? నీ డ్రగ్స్, చీకటి లీలలు తెలియదుకుంటున్నవా? కాంగ్రెస్ తో మీ కుమ్కక్కు రాజకీయాలు తెలియదనుకుంటున్నవా? నా జోలికొస్తే నీ బండారమంతా బయటపెడతా…’’అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘నేను హిందీ పేపర్ లీక్ చేసినట్లు, నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని దేవుడి ముందు నీ ఫ్యామిలీతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా నీకు… నువ్వు ఆ పనిచేస్తే నేను క్షమాపణ చెప్పేందుకు సిద్ధంమని సంజయ్ సవాల్ విసిరారు.

జీవో 29 పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని నిరుద్యోగులు చెబుతున్న మాటలు విని బాధ అన్పించిందని బండి సంజయ్ అన్నారు. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదన్నారు. మోదీ అగ్రవర్ణాలుసహా అన్ని సామాజికవర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్ మాత్రం రిజర్వేషన్లను తీసేయాలని కుట్ర చేయడం దుర్మార్గమన్నారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు. కావాలనే జీవో 29 తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేసి గందరగోళం స్రుష్టించడం ద్వారా గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయాలనే కుట్ర చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు.

నిరుద్యోగులంతా గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయమని మాత్రమే కోరుతున్నారు. అంతకంటే ముందు రిజర్వేషన్లకు గొడ్డలిపెట్టుగా ఉన్న 29 జీవోను రద్దు చేయాలని కోరుతున్నారు. కోర్టులో 22 కేసులు గ్రూప్ 1 పై నడుస్తున్నాయి. వీటిపై లీగల్ ఓపినియన్ తీసుకుని గ్రూప్ 1 రద్దు కాకుండా చూడాలని కోరుతున్నారని చెప్పారు. సోనియాగాంధీ జన్మదినం రోజు… నిరుద్యోగుల పాలిట బలిరోజు కాబోతోందని బండి సంజయ్ అన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదు? నిరుద్యోగుల ఘోష విన్పించడం లేదా? అని బండి నిలదీశారు. 29 జీవోను రద్దు చేసి గ్రూప్ 1 పరీక్షలును రీషెడ్యూల్ చేయాలన్నారు.లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

తాం నిరుద్యోగుల పక్షాన ర్యాలీ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు చొరబడ్డారని.. విధ్వంసం స్రుష్టించేందుకు కుట్ర చేశారని బండి సంజయ్ ఆరోపించారు. నిరుద్యోగులు బీజేపీకి ఇస్తున్న మద్దతును చూసి ఓర్వలేక ఈ కుట్రలు చేశారని.. విధ్వంసం స్రుష్టించి నిరుద్యోగులపై కేసులు పెట్టించే కుట్ర చేశారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేశారని వచ్చిన వార్తల్లో నిజం లేదన్న బండి సంజయ్.. తనను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికి ఉందని అన్నారు.

కేటీఆర్ ఓ మూర్ఖుడు. ఫాల్త్ రాజకీయాలు చేస్తున్నడని మండిపడ్డారు బండి సంజయ్. తాను ర్యాలీ చేస్తుంటే పిచ్చి పిచ్చిగా వ్యక్తిగత దూషణలు చేస్తావా.. యూజ్ లెస్ ఫెలో… నిరుద్యోగుల గురించి పోరాడుతుంటే.పర్సనల్ కామెంట్స్ చేస్తావా? నీదో బతుకా? నీ బాధ భరించలేకే మీ అయ్య ఫాంహౌజ్ లో పండుకున్నడు అంటూ ఘాటుగా కామెంట్ చేశారు బండి సంజయ్. నీకు దమ్ముంటే… నేను పేపర్ లీకేజీ చేసినట్లు గుడి వద్దకు వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా?… నువ్వా నా గురించి మాట్లాడేది? కాంగ్రెస్ తో మీ కుమ్మక్కు రాజకీయాలు ఎవరికి తెల్వుదు. నీ ఫాంహౌజ్ ను సీఎం ఎందుకు కూల్చడం లేదు? నువ్వు డ్రగ్స్ తీసుకునే కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ లో మీ అయ్య ఉన్నాడని నిందితుల వాంగ్మూలం ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఢిల్లీలో మీ అయ్య చేస్తున్న చీకటి రాజకీయాలు, పంపుతున్న డబ్బు సంచుల సంగతి తెల్వదనుకుంటున్నవా? పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నిన్ను నీ పార్టీ కార్యకర్తలే తరిమికొట్టే రోజులొస్తాయని సంజయ్ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి …

  1. కుళ్ళిన కోడి మాంసం అమ్ముతూ.. అడ్డంగా బుక్ అయిన బాలయ్య!
  2. తీవ్ర ఉద్రిక్తత.. సికింద్రాబాద్ అల్లకల్లోలం… హిందూ సంఘాలపై లాటి ఛార్జ్!
  3. మజీద్ పై దాడికి ప్రయత్నం! ముత్యాలమ్మ గుడి దగ్గర లాఠీచార్జ్
  4. మద్యం షాపు వదిలేస్తే… కోటి రూపాయల బంపర్ ఆఫర్!
Back to top button