క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నపూర్ణగా పిలవబడే తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చేశారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. పదేళ్ల కిందట ఆకలి చావులు మరియు ఆత్మహత్యలు జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ తన పదేళ్ల పాలనతో దేశానికే అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టారని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర పాలనలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ ఆత్మహత్యల తెలంగాణ గా మార్చారని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, సామాన్య రైతులు కూడా చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిళ్ల కారణంగా సూసైడ్లు చేసుకున్నారని కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది ప్రజల పాలన కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రజలను వేధించే ప్రభుత్వమని తెలిపారు. ‘జాగో తెలంగాణ జాగో’ అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
1.16 మంది MP లు ఉండి బడ్జెట్లో చిల్లిగవ్వ తీసుకురాలేదు!… ప్రజలకి ఏం చెప్పారు?
2.80 ఏళ్ల చరిత్ర కలిగిన శంకరమఠం కూరగాయల మార్కెట్ ను జెసిబి లతో కూలగొట్టిన అధికారులు!..
3.విద్యార్థులు మంచి లక్ష్యంతో ముందుకెళ్లాలి.. సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్