మార్కెట్ లో అసాధారణ ధరలతో దూసుకు వెళ్తున్న వెస్టేజ్
తక్కువ ధరలకే వస్తువులు లభ్యం
వెస్టేజ్ ఉత్పత్తులు వాడితే ప్రపంచం స్థాయి ఆరోగ్యం
వెస్టేజ్ నూతన బ్రాంచి కార్యలయం ప్రారంభోత్సవం లో ఎమ్మెల్యే పద్మావతి
కోదాడ, (క్రైమ్ మిర్రర్): వెస్టీజ్ మార్కెటింగ్ కంపెనీ ఉత్పత్తి చేసే వస్తువులు వాడితే దీర్ఘకాలంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. సోమవారం “హైదరాబాద్ టూ విజయవాడ” హైవే పై వున్నా కోదాడ జంక్షన్ వద్ద వెస్టీజ్ కంపెనీ నూతన బ్రాంచ్ కార్యాలయాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, కోదాడ మునిసిపల్ వైస్ చైర్మన్ మల్లేశ్వరి తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు..

ఈ సందర్బంగా నూతన బ్రాంచ్ ప్రొపెటర్ ఆడెపు మల్లికార్జున్ ఆయన సతీమణి కృష్ణవేణి తో కలిసి ఎమ్మెల్యే, డిఎస్పీ లకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడారు… వెస్టీజ్‌లో ప్రతి ప్రొడక్ట్ సర్టిఫైడ్(ఐఎస్ఓ ) గుర్తుంపుతో లభిస్తుందన్నారు. వెస్టీజ్‌లో ఆయిల్, ఇంకా వివిధ రకాల ఉత్పత్తులు లభిస్తాయన్నారు.
వీటిని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు లేకుండా సంపూర్ణగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రస్తుతం యాంత్రీకరణ ప్రపంచంలో మార్కెట్‌లోకి ఒక కొత్త ప్రొడక్టు విడుదలయతే వెంటనే దాని పోలిన విధంగా మరోకటి డుప్లీకేట్ విడుదల అవుతుందన్నారు.

ఏది వాడాలో ఏది వాడకూడదో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే వెస్టీజ్ కంపెనీలో నైతే ఫ్యూరిఫైడ్, వందశాతం సర్టిఫైడ్ చేసిన ఉత్పత్తులు లభిస్తూ ప్రజలకు సంజీవనిగా పని చేస్తున్నాయన్నారు. తెలంగాణ వెస్టీజ్ కంపెనీ మంచి రేటింగ్‌తో దూసుకెళ్తూ ప్రజల నమ్మకానికి అనుగుణంగా ఉత్పత్తులను అందజేస్తుందన్నారు.

కావున ప్రజలు అన్నింటికంటే ఆరోగ్యం ప్రధానం కావున వెస్టీజ్ ఉత్పత్తులను వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఆమె వెంట అదికారులు, సెక్రటేరియట్ సీనియర్ రిపోర్టర్ పెరబోయిన గోపి, వెస్టీజ్ కంపెనీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
