Tuesday, February 24, 2026
Homeజాతీయంక్యాస్టింగ్ కౌచ్ ఇష్యులో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు...

క్యాస్టింగ్ కౌచ్ ఇష్యులో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు…

క్రైమ్ మిర్రర్, కేరళ : కేరళ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం రోజురోజుకి తీవ్ర ధుమారం రేవుతోంది. కాగా ఇప్పటికే ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో కేరళ సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ డైరెక్టర్లు, నటులు, నిర్మాతలు తదితరులు ఇరుక్కున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు సిద్ధిక్ పేరు కూడా ఉంది. దీంతో ఇటీవలే నటుడు సిద్ధిక్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసి ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టులో అప్పీల్ చేశాడు. కానీ విచారణ జరుగుతున్న సమయంలో ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యడం కుదరదని హైకోర్టు బెయిల్ పిటీషన్ ని కొట్టివేసింది.

Read More : సిద్దరామయ్య సీఎం పదవి ఊస్ట్.. నెక్స్ట్ టార్గెట్ రేవంతేనా?

అయితే ఈ లైంగిక వేధింపుల కేసులో రోజుకో కొత్త పేరు బయటికొస్తోంది. కాగా ఇందులో స్టార్ హీరోల చిత్రాలకి డైరెక్టర్ గా పని చేసిన ప్రముఖ దర్శకుడు రంజిత్, తోపాటూ పలు మాలీవుడ్ చిత్రాల్లో నటించిన జయసూర్య, ముఖేష్, మణియం పిల్ల రాజు, ఎడవెల బాబు, తదితరులు సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ల పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments