Sunday, March 22, 2026
Homeజాతీయంమణిపూర్‌ కొత్త సీఎంగా కేమ్‌చంద్

మణిపూర్‌ కొత్త సీఎంగా కేమ్‌చంద్

మ‌ణిపూర్‌కు 2వ బీజేపీ సీఎం

ఇంపాల్, క్రైం మిర్ర‌ర్ః
ఈశాన్య రాష్ట్ర‌మైన మ‌ణిపూర్‌కు ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యుమ్నమ్ కేమ్‌చంద్ సింగ్ ఎన్నికయ్యారు. కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన రాష్ట్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ప్రజా స్వామ్య ప్ర‌భుత్వం ఏర్పాటుకు నిర్ణయించుకుంది.

దీంతో బీరేన్ సింగ్ సహా ఐదుగురి పేర్లు పరిశీలించిన తర్వాత కేమ్‌చంద్‌ను అధిష్ఠానం ఎంపిక చేసింది.

ఏడాదిగా రాష్ట్ర‌ప‌తి పాల‌న‌…
ఏడాది కిందట ముఖ్యమంత్రి పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేసినప్ప‌టి నుంచి రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కొన‌సాగుతుంది.

కాగా బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో కేమ్‌చంద్‌ను తమ నాయకుడిగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నకున్నారు.

దీంతో కేమ్‌చంద్‌కు సీఎం ప‌ద‌వి వ‌రించింది.దీంతో ఆయన మణిపూర్‌కు రెండో బీజేపీ సీఎం కానున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments