
మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్ : బిఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోండి ఖబర్దార్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు, వేములపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ జడ రాములు యాదవ్ హెచ్చరించారు. శనివారం స్థానికంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి స్థాయికి మించి విమర్శించడం తగదన్నారు. అదేవిధంగా జగన్ తో అంటగాగి, టిడిపిని అధినాయకుని చూసి రాజకీయంగా భయపడుతూ విమర్శించడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తారన్నారు. నేడు టిఆర్ఎస్ పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోతుందని, తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణకు భయపడుతూ చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, ఇప్పటికైనా టిఆర్ఎస్ నాయకులు తెలుగుదేశం పార్టీ, అధినాయకుని విమర్శించడం మానుకోకుంటే వారి మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతుందన్నారు.
భవిష్యత్తులో కూడా గత ఎన్నికల్లో ఏదైతే ఫలితాలు వచ్చాయో మళ్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికొస్తే అవే ఫలితాలు పునరావృతం అవుతాయని హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో గోదావరి జలాలను తెలంగాణ ప్రజలకు అందించకుండా స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల ఆర్థిక వెనుకబాటు తనానికి కారణం కేసీఆర్ రే కారణం.. తెలంగాణలో 10 సంవత్సరాల పరిపాలించిన తర్వాత కూడా సెంటిమెంట్ ని రెచ్చగొడుతూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం శాసనసభ్యుడుగా కూడా కేసిఆర్ పనికిరాడు, నిజంగా ప్రజల పట్ల మమకారం ఉంటే జగదీశ్ రెడ్డి, కేసీఆర్ లు రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షులు షేక్ రసూల్, ప్రధాన కార్యదర్శి కట్టా అనంతరెడ్డి పాల్గొన్నారు.