క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు గురవడంపై దాఖలైన పిటిషన్‌పై భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. అలాగే ఫిర్యాదుదారుడికి కోర్టు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల (జనవరి) 7వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. కాగా.. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కేసీఆర్, హరీష్ రావులకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై రాజలింగం అనే వ్యక్తి భూపాలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read : సీన్ ఆఫ్ అఫెన్స్… సినీ నటుడు అల్లు అర్జున్ మరోసారి సంధ్య థియేటర్‌కు
పిటిషన్‌ను విచారించిన భూపాల్లి కోర్టు.. కేసీఆర్‌తో పాటు అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, అలాగే బీఆర్‌ఎస్ హయాంలో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులకు జూలై 10న నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న కోర్టుకు హాజరుకావాలంటూ కేసీఆర్, హరీష్ రావులను భూపాలపల్లి కోర్టు ఆదేశించింది. అయితే భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేసీఆర్, హరీష్‌రావులు హైకోర్టును ఆశ్రయించారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలంటూ హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కేసీఆర్, హరీష్‌రావు వేసిన పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టు విచారణ జరిపింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేయడంతో పాటు ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి :
- రేవంత్ పై హైకమాండ్ సీరియస్.. అల్లు ఎపిసోడ్‌లో ఎవరూ మాట్లాడొద్దని వార్నింగ్!
- అల్లు అర్జున్ కు అండగా నిలిచినా బీజేపీ మరియు బి ఆర్ ఎస్
- నా భార్య భూమా మౌనికను చంపాలని ప్లాన్! అన్నపై మంచు మనోజ్ కంప్లైంట్
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన… బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ ఆర్ధిక సహాయం
- తెలంగాణ ఉద్యమంలో లేని హీరోలు మాకెందుకు.. దొబ్బెయండి!