తెలంగాణ

ఇబ్రహీంపట్నం సిపిఐ మండల కార్యదర్శిగా కావలి సురేష్

ఇబ్రహీంపట్నం,క్రైమ్ మిర్రర్:-సిపిఐ పార్టీ మండల నూతన కార్యదర్శిగా కావలి సురేష్ ని పార్టీ మండల మహా సభలో ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని ఎన్ఆర్ గార్డెన్ లో, సిపిఐ పార్టీ 11వ మండల మహాసభలు శుక్రవారం నిర్వహించారు. ఈ మేరకు జరిగిన నూతన మండల కమిటీ ఎన్నికలో మండల కార్యదర్శిగా కావలి సురేష్ ని మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కావలి సురేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మండల కార్యదర్శిగా ఎన్నుకున్న మండల కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ పార్టీకి ఎంతో చరిత్ర ఉన్నదని, కమ్యూనిస్ట్ లు నిరంతరం పేద ప్రజలకోసం అహర్నిశలు పోరాడతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూమి కోసం కమ్యూనిస్ట్ లు చేసిన పోరాటం మర్వలేనిదన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో భూ పోరాటాలు చేసి నిరుపేదలకు భూములను, ఇంటి పట్టాలను పంచిన చరిత్ర ఉన్న పార్టీ సిపిఐ పార్టీ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సిపిఐ పార్టీ పోరాటం మరువలేనిదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పొత్తు ఉన్న ప్రజల కోసం పోరాటంలో రాజీపడలేదన్నారు. పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ముందుగా గుర్తుకు వచ్చేది కమ్యూనిస్టులే అని అన్నారు. పేదరిక నిర్మూలనకు, పేద వారికి భూమి, ఇంటి స్థలం కోసం సిపిఐ పార్టీ తరపున శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. రాబోయే సంస్థగత ఎన్నికల్లో సిపిఐ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవటానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు కావలి నర్సింహా, ఏఐటీయూసీ నాయకులు ఒరిగంటి యాదయ్య, సిపిఐ నాయకులు నీలమ్మ, శివరాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

యువకుడి ప్రాణం ఖరీదు మూడు లక్షలు.. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన అమాయకుడు!

పవర్‌ లూమ్‌ కార్మికుల సమస్యలు తీర్చండి… సీఎం రేవంత్‌రెడ్డికి ఆలిండియా పద్మశాలి సంఘం వినతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button