
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- కార్తీకమాసం ప్రారంభమయ్యింది.. దాదాపు ఒక నెలరోజుల పాటు ఈ మాసం ఉంటుంది. శివుడికి ఈ కార్తీకమాసం అంటే అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. కార్తీకమాసం సందర్భంగా శివాలయాలు అన్ని కూడా భక్తులతో కిటికీటలాడుతాయి అనడుములో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఏడాది కూడా కార్తీకమాసంలో శివుని దేవాలయాలు భక్తులతో రద్దీ ప్రదేశాలుగా మారిపోతాయి. ఎనలేని భక్తి ప్రజలందరికీ ఈ కార్తీకమాసంలో రావడం ఒక విశేషం అనే చెప్పాలి. ఈ కార్తిక మాసం అత్యంత పవిత్రమైనదిగా భావించి తెల్లవారుజామున నది స్నానాలు చేసి దేవాలయాలను భక్తులు దర్శించుకోవాలని వేద పండితులు చెప్పుకొస్తున్నారు. ఈ సమయంలోనే ప్రతి ఒక్కరూ తులసి కోట, దేవాలయాలు అలాగే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం లాంటివి చేయడం చాలా మంచిది అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీకమాసంలో కార్తీకమాస వ్రతం ఆచరించాలని భక్తులకు పండితులు సూచిస్తున్నారు. కార్తీక్ మాసంలో కొన్ని మంచి పనులు చేయడం వల్ల… రెండు రెట్లు మంచి కలుగుతుంది అని అంటున్నారు. ఇంకొన్ని పనులు చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా అన్నదానం, వస్త్ర దానం, గోదానం వంటి పనులు చేయడం వల్ల నీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. మరోవైపు ఈ కార్తీకమాసంలో ఎంతోమంది భక్తులు వాళ్లు కొలిచేటువంటి స్వామివారి మాలలు వేసుకుంటారు. ఉదాహరణగా అయ్యప్ప మాల, శివుని మాల ఇలా పలు రకాలుగా వాళ్ళు కొలిచేటువంటి దేవుడు తమ కోరికలు నెరవేరుస్తాడు అని లేదా తీర్చాడన్న సందర్భంగా మాలలు ధరిస్తారు. వీరందరూ కూడా దాదాపు 48 రోజులపాటుగా స్వామివారిని స్మరిస్తూ.. స్వామి వారికి అభిషేకాలు చేస్తూ… ఎంతో నిష్టగా, భక్తితో పూజలు చేస్తూ ఉంటారు.
Read also : నటి రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే సన్యాసం అంటా?
Read also : వార్ -2 పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన నాగ వంశీ