
క్రైమ్ మిర్రర్,శంకర్ పల్లి:- మూడు నెలల సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణా తరగతులు శంకర్పల్లి ఆదర్శ పాఠశాలలో జరుగుతున్నాయని కరాటే మాస్టర్ రవీందర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ శోభారాణి ఆధ్వర్యంలో కరాటే మాస్టర్ రవీందర్ యాదవ్ బ్లాక్ బెల్ట్ సిక్స్త్ డాన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత విద్యార్థినిలకు కరాటే పోటీలు నిర్వహించారు. ఇందులో అక్షర ఏడవ తరగతి, వైష్ణవి 8వ తరగతి, మోక్షిత ఏడవ తరగతి,లహరి ఏడవ తరగతి, అనూష ఏడవ తరగతి విద్యార్థినిలు గెలుపొందారు. వారికి స్కూల్ ప్రిన్సిపల్ శోభారాణి చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ అశోక్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
Read also : ఘనంగా నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Read also : రైతుల కోసం మరో కొత్త పథకం.. భారీగా నిధుల విడుదల





